'సమగ్ర' అనే పదం కలిసికట్టుగా మరియు మొత్తంగా అనే అర్ధాలు కలిగి ఉంది. మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమగ్ర మార్పు మరియు అభివృద్ధిని తీసుకురావడమే ఈ ప్రచార లక్ష్యం. సమగ్ర మార్పు మరియు అభివృద్ధి అంటే అట్టడుగు స్థాయి నుండి మార్పును తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించడం మరియు అందరి పౌరులను చేర్చుకోని కలిసికట్టుగా అభివృద్ధి సాధించడమే మన ద్యేయం.
<
మన మోటివ్ 'స్థానిక స్వపరిపాలన.' అభివృద్ధి చెందే దేశం ఎప్పుడూ అట్టడుగు స్థాయి నుండి ఒకే మార్గంలో అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పని చేస్తుంది మరియు స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ద్వారా అది సాధ్యమవుతుంది. వ్యర్థాల నిర్వహణ, పట్టణ వరదలు, సరిగ్గా లేని రోడ్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య, విద్యుత్ సమస్యలు మొదలైన స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం మరియు రాష్ట్రం నుండి స్థానిక ప్రభుత్వానికి అధికార వికేంద్రీకరణ అవసరం. అదే వికేంద్రీకృత ప్రజాస్వామ్యం
<
మన దృష్టి మరియు లక్ష్యాలు మన దేశం యొక్క వ్యవస్థాపక సభ్యులు మరియు నాయకుల ఆలోచనల పై నిర్మించబడింది. సామాజిక వివక్ష, ఆర్థిక అసమానత, పర్యావరణ నష్టం మరియు రాజకీయ అన్యాయం లేని భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. స్వాతంత్ర్యానికి ముందు మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న భారతదేశానికి ప్రాణం పోయడం మన లక్ష్యం. ఈ విధంగా, ప్రగతిశీల భారతదేశం వైపు 'సమగ్ర శేరిలింగంపల్లి'తో ప్రారంభించి, అట్టడుగు స్థాయి మార్పు మరియు అభివృద్ధిని తీసుకురావడానికి మన ఎజెండా ని ఈ విధంగా తయారుచేశాము