This Time A Normal Person MLA Of The Serilingampally Constituency

సమాజాన్ని బాగు చేయాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆ సమాజాన్ని బాగుచేయటానికి తమ జీవితాన్ని అంకితం చేసే త్యాగం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరే ఆకర్ష్ శ్రీ రామోజు. తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఆలోచించగల మంచి మనసున్న వ్యక్తి.

చిన్నతనం నుండే చదువు మీద ఆసక్తి, అంతే కాకుండా చదువే అందరి జీవితాల్ని మార్చగలదు అని ఎంతో నమ్మకం. కానీ సంప్రదాయ విద్య అతని ఆశలు మీద నీళ్లు చల్లింది. చదువు వ్యాపారం అవ్వటం, చదువు నిర్లక్ష్యం కావటం అతను చూడలేకపోయారు. విద్య వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు జరిగి తీరాలని ఆ వయస్సులోనే గ్రహించారు.

అప్పటి నుండి తన చదువును కొనసాగిస్తూనే తన ఆలోచనకి పదును పెడుతూ, పెద్ద ఎత్తున మంచి మార్పులు తీసుకురావాలంటే రాజకీయాల వల్లే సాధ్యం అని గ్రహించి రాజకీయాల్లోకి వచ్చారు.

ఆయన ఉద్దేశ్యం ప్రజలకి మేలు చేయాలని, తన చదువుని, తన అనుభవాల్ని ఉపయోగించి ప్రజలకి సాయంగా, అండగా నిలబడాలి అన్నది ఆయన ఉద్దేశ్యం.

కష్టం అని వచ్చినా ప్రతీ ఒక్కరికి సాయం చేయటమే కాదు. ఆ కష్టం అన్నది లేకుండా చేయలన్నదే ఆయన ధ్యేయం. అందుకే మనలో ఒకరై ఉంటూనే మన సమస్యలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు

శేరిలింగంపల్లి ప్రజలు (Serilingampally Constituency People) పడుతున్న కష్టాలు ఆయన కళ్లారా చూసారు. వరద నీళ్లతో నిండిపోయే రోడ్లు, గుంతలు పడిన రోడ్లు, ఉచిత పథకాలతో ఊరించి అభివృద్ధి ని గాలికి వదిలేసిన నాయకుల్ని చూసి, ఎంతో ఆలోచించి తనే నాయకుడై ప్రజలు కోసం నిలబడాలి అని నిర్ణయించుకున్నారు. 

భవిష్యత్తు ని అందంగా నిర్మించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా అవన్నీ కాదనుకుని, తన ప్రజలు సంతోషమే తనకి ముఖ్యమని చేతికి అందిన అవకాశాలు అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. అతన్ని నమ్మి ఒక అవకాశం ఇస్తే ప్రతి ఇంటి బిడ్డ గా మారి, ఆ ఇంటి పెద్ద కొడుకులా బాధ్యత నిర్వర్తిస్తారు. నిస్వార్థంగా ఇంకొక మనిషికి సాయం చేసేవాళ్లే అరుదుగా ఉన్న ఈ లోకం లో, సమాజం కోసం తన భవిష్యత్తు ని, జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళని వదులుకుంటే మన జీవితాలు ఇంకా దుర్లభమైపోతాయి. మన ఓటు ఆకర్ష్ గారికే వేద్దాం. మన భవిష్యత్తు బాగుచేసుకోవటానికి ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం.

తెలంగాణ వచ్చాక ఏమి అభివృద్ధి జరిగిందో, ఇంకా ఏ ప్రాంతాలు అభివృద్ధి కి నోచుకోకుండా ఉన్నాయో మన అందరికీ బాగా తెలుసు. ఎందుకు ఆ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. ఎందుకు ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధికి చేరువ కాకుండా ఉండిపోవాల్సి వస్తుంది. వారు ఏ పాపం చేశారు. ఏ వారికి అందరితో సమానంగా బతికే హక్కు లేదా, వారు ఈ రాష్ట్ర పౌరులు కాదా. ఓటు కోసం వచ్చినప్పుడు మాత్రమే వారు ఈ రాష్ట్రంలో భాగం అని ఫీల్ అవుతారా? ఆ తరువాత వారీ భవితవ్యాన్ని గాలికి వదిలేసి డబ్బు పోగు చేసుకునే పనిలో పడిపోతారా?ఇలా ప్రభుత్వాన్ని  న్యాయం కోసం, అందరి హక్కుల కోసం నిలదీసి ప్రశ్నించి పోరాడే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. ఆ ఒక్కరు ఆకర్ష్ గారు. అంతే కాదు నిరంతరం ప్రజల క్షేమం కోసం తపిస్తూ వారి జీవితాల్లో వెలుగుని నింపాలని ప్రతి క్షణం అరాటపడుతూ ఉంటారు. ఆయన ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన తోనే చిన్నప్పటి నుండి పెరిగారు. ప్రజలకు సేవ చేసేందుకే బతుకుతున్నారు

శ్రీశ్రీ గారి పంక్తులలో ఒకటి అయ్యిన “నేను సైతం ప్రపంచానికి సమీదనొక్కటి ఆహుతిచ్చాను” అన్నది ఆకర్ష్ గారికి సరిగ్గా సరిపోతుంది. ఆకర్ష్ గారిని నమ్మి గెలిపించి అతను విజయ బావుటా ఎగరేసేందుకు సాయం చేయండి. మీ మద్దతు తెలపండి. ఒక్కసారి నమ్మి చూడండి – మీ భవిష్యత్తు బాగుచేసుకోండి.

నేర చరిత్ర ఉన్నవాళ్ళకి, అవినీతి పరులకి, తప్పుడు పనులు చేసేవాళ్ళకి అవకాశం ఇచ్చే బదులు మన మంచి కోరే వారికి, మన మంచి కోసం పరితపించే వారికి ఓటు వేద్దాం. డబ్బులు ఇచ్చి ఓటు కొనేవాళ్ళకి, మద్యం పోసి ఓటు ని అన్యాయంగా సంపాదించుకునే వాళ్ళకి కాకుండా నీతీ, నిజాయితీ కి కట్టుబడి ఆకర్ష్ గారికె ఓటు వేద్దాం.

శేరిలింగంపల్లిని ( Serilingampally constituency ) అభివృద్ధి పరచటమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆకర్ష్ గారికి మీ సహాయ సహకారాలు అందించి, మీ ప్రాంతాన్ని, జీవితాల్ని బాగు చేయగల సామర్థ్యం ఉన్న ఆకర్ష్ గారిని MLA గా గెలిపిస్తారని ఆశిస్తున్నాము.

ఆకర్ష్ గారిని గెలిపించండి – మన జీవితాల్లోకి అభివృద్ధి ని ఆహ్వానించండి. ఇంకెందుకు ఆలస్యం ఆకర్ష్ గార్కి మద్దతు పలుకుదాం రండి.