మన దేశం యొక్క వ్యవస్థాపక సభ్యులు మరియు స్వాతంత్ర్య సమరయోధులు మన మాతృభూమి కోసం తమ రక్తాన్ని మరియు చెమటను ధారపోశారు , వాటి ఫలితమే 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుండి మనం స్వేచ్ఛగా, గౌరవప్రదంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా జీవితాన్ని గడపగలుగుతున్నాము. మన స్వాతంత్ర్య సమరయోధులు సామాజిక వివక్ష, ఆర్థిక అసమానతలు, పర్యావరణ నష్టం మరియు రాజకీయ అన్యాయం లేని ప్రగతిశీల భారతదేశం గురించి కలలు కన్నారు. ఉదారవాద సమాజంలో ఈ సూత్రాల ప్రకారం జీవించడానికి, మనం 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించాము మరియు అవసరమైనప్పుడు సవరణలు చేసాము.
మనల్ని మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. నేడు మనం నిజంగా అభివృద్ధి చెందిన భారతదేశంలో జీవిస్తున్నామా? 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, భారతదేశం ఆర్థిక అనిశ్చితి మరియు రాజకీయ మార్పులతో కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటిస్థానంలో ఉండటానికి భారతదేశం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది; అయినప్పటికీ, ఒక దేశంగా సమగ్ర వృద్ధి మరియు అభివృద్ధిని సాధించడానికి మనం చాలా కష్టపడాలి . మన కేంద్రం GDP లేదా బలమైన రోడ్లు మరియు సదుపాయాల పై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తూ, మన జీవన నాణ్యత వైపు మరియు పెరుగుతున్న పేదరికం వైపు ప్రాధాన్యత అంతగా ఇవ్వట్లేదు.
స్వాతంత్య్రానంతర భారతదేశం యొక్క 75 సంవత్సరాల ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుని ఆలోచిస్తే, 1947లో మన వ్యవస్థాపక సభ్యులు ఊహించిన అభివృద్ధి కోసం మనం కఠినంగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతుంది. మనం అక్కడికి ఎలా చేరుకోవాలి? మనం ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మరియు పరిష్కారాలను చర్చించడానికి ముందు, మొదట చరిత్రను అర్థం చేసుకుందాం. ఎందుకంటే చారిత్రక మార్పును సృష్టించాలంటే ముందుగా మన చరిత్రను తెలుసుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి.
అమలు చేయబడిన విధానాల గురించి తెలుసుకోవడానికి భారతదేశ స్వాతంత్య్రానంతర కాలంలో ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. లీబరలైజేసన్ ఆవిర్భావం తర్వాత, 1990లలో వ్యాపార వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయో కూడా చూద్దాం.