GHMC is functioning Irresponsibly

హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కి మారుపేరు గా ఎదుగుతూ ఉంటే, హైదరాబాద్ నగర వాసుల కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. వానొస్తే, వాన తో పాటుగా వరద వస్తే నదుల్లా పొంగి పారే రోడ్ల పై నీళ్లు, మంచి నీళ్ళకి, మురికి నీళ్లకి తేడా తెలియనంతగా కలిసిపోయిన నీళ్ల లో తిరిగి ఒంటి మీదకి లేని పోని రోగాలు తెచ్చుకునే తీరిక లేని ప్రజలు. ఓ వైపు అభివృద్ధి మరో వైపు అంధకారం. 



ఈ మధ్యనే డ్రైనేజి సిస్టమ్ బాలేదని ఇచ్చిన కంప్లెయింట్ కి అలస్యంగా స్పందించి, సగం సగం పనులతో మధ్యలోనే బాగు చేయటం నిలిపివేసి, చుట్టూ పక్కల ప్రజలంతా GHMC యాప్ లో కంప్లయింట్ ల మోత మోగిస్తూ ఉంటే, అంతంత మాత్రం గా పని చేస్తున్న ఆ యాప్ కూడా నగర పాలన వ్యవస్థ లాగా అకస్మాత్తుగా పనిచేయటం మానేసింది.

ప్రజల సమస్యలు వినే నాయకులే కానీ, ఆ సమస్యలని తీర్చే నాయకులు కరువయ్యారు. ఇలానే ఉంటే కొన్నాళ్ళకి ప్రజలకి సిస్టమ్ మీద గౌరవంతో పాటు నమ్మకం కూడా పోతుంది.

జేబులు నింపుకునే అధికారులు, ఆస్తులు కూడబెట్టుకునే పొలిటీషియన్స్ కాకుండా వారి కష్టాలని తీర్చే నాయకులు కావాలి.

 

ఆహారం, ఆరోగ్యం ప్రతి మనిషికి అత్యవసరమైన అవసరాలు. కనీస అవసరాలు తీరనిదే ఎవరూ సంతోషంగా ఉండలేరు. ఒళ్ళంతా గుల్ల చేసుకుని కష్టపడినా ఫలితం కష్టమే మిగులుతుంటే, చెమట చిందించి పన్నులు కడుతుంటే, ఉచిత పథకాలుతో ఆ పన్నులను పెద్దలు కొల్లగొడుతుంటే ఏం జరుగుతుందో తెలియని ప్రజలు సదా కష్టంలో  ఉంటున్నారు.

జెనెరల్ గా బయటకి వెళ్లినపుడు గమనించింది ఏంటంటే, ప్రజలు ఫైన్ లు భయంతో ట్రాఫిక్ రూల్స్ బాగానే ఫాలో అవుతున్నారు. కానీ మున్సిపాలిటీ లు, పబ్లిక్ బాడీలు తమ పని అవి సరిగా చేస్తలేవు. సరిగా రూల్స్ ఫాలో అవ్వని ప్రజలకు ఫైన్ లు ఉన్నట్టుగా, సరిగా పని చేయని గవర్నమెంట్ బాడీస్ కి ఫైన్ ఎందుకు లేదు?

ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వైద్య శాఖ ఫైన్ కట్టాలి, రోడ్ల పై మురికి కాల్వలు పొర్లితే మున్సిపాలిటీ బాధ్యత గా ఫైన్ కట్టాలి. చెత్త మీద కూడా పన్ను కట్టించుకునే సువిశాల భారతదేశం లో చచ్చుబడినట్టుగా పని చేయక, తప్పు గా పనిచేసే ప్రతి వ్యవస్థ, ప్రతి మనిషి ఈ దేశానికి ఫైన్ కట్టాలి.