గత అధ్యాయంలో, స్వాతంత్య్రానంతరం భారతదేశం యొక్క రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులలో మార్పులను మనం చూశాము. పౌరుల కోరికలు మరియు ఎంపికలతో సహా అనేక చర్యలను ప్రభుత్వం నియంత్రించింది. అన్ని ప్రధాన రంగాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల వ్యాపారాలు ఊపందుకోలేకపోయాయి. హరిత విప్లవం ద్వారా ఆకలి సంక్షోభం పరిష్కరించబడినప్పటికీ, తక్కువ జీవన నాణ్యత, తక్కువ ఆదాయ స్థాయి మరియు GDP యొక్క తక్కువ వృద్ధి కారణంగా పేదరికం పెరిగింది. 1990 సరళీకరణకు ( లీబరలైజేసన్ ) నాంది పలికింది; మార్కెట్ల నియంత్రణను ప్రభుత్వం వదులుకోవడంతో ప్రైవేట్ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి.
1990 నుండి నేటి భారతదేశం వరకు, USA నుండి ప్రేరణ పొందిన నయా ఉదారవాదం ( నియోలిబేరలిజం) విధాన ఫ్రేమేవర్కుని అనుసరించడం ద్వారా భారతీయ మార్కెట్ విదేశీ పెట్టుబడిదారులకు వెసులుబాటు ఇచ్చింది మరియు FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) పొందింది. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఐటీ రంగం భారీగా అభివృద్ధి చెందడానికి దారితీసింది. మనం దేశం ఒకదానితో ఒకటి సంబంధం పెంచుకున్న గ్లోబలైజ్డ్ ప్రపంచం వైపు అడుగులు వేసాము.
పేదరిక నిర్మూలన, పారిశ్రామికాభివృద్ధి సాధించడమే ఈరోజు మన ప్రాధాన్యత. ప్రభుత్వం యొక్క నియంత్రణ ఇపుడు సడలిపోయింది మరియు మన కోరికలు విపరీతంగా పెరిగాయి; మనకు వేరు వేరు ఎంపికలు వచ్చాయి. మరోవైపు, మధ్యతరగతి జనాభా నిరంతరం పెరుగుతూ వస్తోంది; కానీ జనాభాలో 60% ఇప్పటికీ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. GDP పెరిగింది మరియు వార్షిక సగటు 6-7% చొప్పున ఉంది. అయితే, ఈ వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పించేందుకు దారితీయలేదు. పన్ను తగ్గింపుల కారణంగా ఈ కాలంలో వ్యాపార వ్యవస్థాపకులకు ప్రయోజనకరంగా మారింది. ఫలితంగా స్టార్టప్‌లు పెరిగాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కాలంలో భారతదేశం సాధించిన మొదటి విజయం పేదరిక స్థాయి తగ్గింపు (కోవిడ్-19 మహమ్మారి వరకు ఇది నిజం). ఏదేమైనా, ఒక ఆదాయ స్థాయి పెరుగుదల ద్వారా దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వ్యక్తులను ఉద్ధరించడం ద్వారా పేదరికం యొక్క అనేక ఇతర కోణాలను పరిష్కరించదని నిపుణులు గమనించాలి. నయా ఉదారవాద (నియోలిబేరలిజం) విధాన ఫ్రేమ్‌వర్క్ కొంతవరకు బాగా పనిచేసింది, అయితే ఇది అనేక సమస్యలను సృష్టించింది:
1) ఆదాయ అసమానత; 2020లో విడుదల చేసిన టైమ్ టు కేర్ ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, మొత్తం జాతీయ సంపదలో 42.8% జనాభాలో టాప్ 1% చేతిలో ఉంది మరియు దిగువ 50% జనాభా చేతిలో మొత్తం జాతీయ సంపదలో 2.8% మాత్రమే కలిగి ఉంది.
2) క్రోనీ క్యాపిటలిజం కారణంగా రాజకీయ నాయకుల సహాయంతో బడా ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యం పెరగడం.
3) కార్మిక హక్కుల ఉల్లంఘన, అసమంజసంగా తక్కువ వేతనాలు మరియు పని గంటలను పెంచడం.
4) ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల పర్యావరణానికి నష్టం, సహజ వనరులు ఉలంగాణ మరియు వాతావరణ మార్పులుకు కారణం ఇది
ఈ పాలసీ ఫ్రేంవర్క్ 2008లో గ్లోబల్ రేసిషన్ వల్ల (USAలో నయా ఉదారవాద విధానాల లోపాల వల్ల ఏర్పడింది) రోడ్‌బ్లాక్‌ను చూసింది. అప్పటి నుండి, ఈ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఏ దేశంలోనూ సరిగ్గా పని చేయలేదు; రాజకీయ నాయకులు మరియు మీడియా అందరికీ ఇది తెలుసు, అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఓట్లు సాధించడానికి దేశాన్ని విభజించడానికి తప్పుడు భావోద్వేగాల రెచ్చగొట్టడంతో కఠినమైన నిజాలను కప్పిపుచ్చారు. ఆ పరిస్థితిని యునైటెడ్ స్టేట్స్‌లో ,దురదృష్టవశాత్తు నేటి భారతదేశంలో చాలా ఎక్కువగా గమనించవచ్చు. నయా ఉదారవాద విధాన ముసాయిదా పతనమై 12 ఏళ్లు గడిచినా, మనం ఇప్పటికీ విఫలమైన విధానాల చుట్టూ పని చేస్తున్నాము మరియు ప్రతిదాని ప్రైవేటీకరణ వైపు వేగవంతం చేస్తున్నాము. ఇది జనాభాలో అగ్రశ్రేణి 1% ప్రజల కోరికలు, అవసరాలను మాత్రమే నెరవేర్చింది అలాగే మిగిలిన 99%, అంటే మధ్యతరగతి మరియు పేదలు ఇప్పటికీ ప్రాథమిక అవసరాలను కోసం కష్టపడుతున్నారు. ఇటీవల విడుదలైన CMIE మే-ఆగస్టు నివేదిక ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగం రేటు 7.43%, ఇది గ్రాడ్యుయేట్లలో అత్యధికంగా 17.4%. భారతదేశ ఆర్థిక సంక్షోభం 2019లో ప్రారంభమైనందున ఈ గణాంకాలు కోవిడ్ 19 మహమ్మారికి ముందు ఉన్న వాటితో పోల్చవచ్చు.
దేశం మరియు సమాజ అభివృద్ధికి రాజకీయ నాయకులు అమలు చేసే విధాన రూపకల్పన ఫ్రేమ్‌వర్క్ ఎలా అవసరం అనేది ఇక్కడ నేర్చుకోవలసిన కఠినమైన పాఠం. మన రాజకీయ నాయకులకు అభివృద్ధి అంటే GDP వృద్ధి మాత్రమే అని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, 1990 సంవత్సరంలో, GDP ఒక దేశంలో జీవన నాణ్యతకు సూచికగా ఉండదని విశ్లేషించి తేల్చిచెపింది. అందువల్ల, GDP స్థానంలో మానవ అభివృద్ధి సూచిక (HDI)ను UN అభివృద్ధి చేసింది. ఒక నిర్దిష్ట దేశంలో ప్రజల విద్య, ఆదాయం మరియు ఆరోగ్యం ఆధారంగా HDI రూపొందించబడుతుంది. 2022 మానవాభివృద్ధి సూచీక నివేదికలో, గుర్తింపు పొందిన 191 దేశాలలో భారతదేశం 132వ ర్యాంక్‌లో నిలిచింది. గత 30 ఏళ్ల నయా ఉదారవాద విధానాల వల్ల మన దేశం ఇంకా సంక్షోభంలో ఉందని ఇది సూచిస్తుంది.
మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో, ప్రజల సంక్షేమం కోసం విధానాలను రూపొందించడానికి ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు. కానీ మన రాజకీయ నాయకులు కార్పొరేట్ ప్రయోజనాలు మరియు లాభాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు & చట్టాలను అమలు చేస్తున్నారు కానీ ప్రజల కోసం కాదు. ప్రస్తుత కాలంలో, పౌరుల సంక్షేమంపై దృష్టి సారించని విధానాలకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఏ స్వరం అయినా అణచివేయబడుతుంది, రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం మరియు భావప్రకటనా స్వేచ్ఛను నియంత్రించబడుతుంది. ఈ ప్రభావం తో 2014లో ప్రజాస్వామ్య సూచీలో భారతదేశం యొక్క ర్యాంకింగ్‌ను 27వ స్థానం నుండి 2021లో 46వ స్థానానికి తగ్గించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందడం మరియు విచ్చిన్న ప్రజాస్వామ్యంగా ముద్రవేయబడడం నిజంగా బాధాకరమైన విషయం; నేడు మనం విచ్చిన్న ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవాలి.
వచ్చే అధ్యాయంలో, మనకు తెలిసిన ఫ్రేంవర్క్ కానీ ఎపుడు సమర్ధంగా అమలు పరచని దాని గురించి పరిశీలిద్దాము, భారతదేశంలో గ్రాస్ రూట్ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి ఒక కొత్త స్ఫూర్తిని పెంచడం గురించి తెలుసుకుందాం.