అధ్యాయం 3: అభివృద్ధి చెందిన భారతదేశం వైపు కొత్త ఫ్రేమ్‌వర్క్

ముందు అధ్యాయంలో, నయా ఉదారవాదం, ప్రైవేటీకరణలోని లోపాలను మనం వివరంగా అర్థం చేసుకున్నాము. ఆ మార్పులు అట్టడుగు స్థాయి సమస్యలను పరిష్కరించలేదని మనం తెలుసుకున్నాము. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కావలసింది కొత్త ఫ్రేమ్‌వర్క్ , స్వాతంత్ర్యానికి ముందు మన స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులు సూచించినది. ఈ అధ్యాయంలో, ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను చూద్దాం.   


నయా ఉదారవాదం, ప్రైవేటీకరణ వైఫల్యం భారతదేశంలో కొత్త విధాన ఫ్రేమ్‌వర్క్ అవసరాన్ని చూపుతుంది; రాజకీయాలలో తక్షణ మార్పు అవసరం, ఎందుకంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మన రాజకీయ వర్గం 1947 నుండి ఇప్పటి వరకు అనేక రంగాలలో మన దేశం ఓడిపోయింది. బాధ్యతాయుతమైన పౌరులు, యువకులు మరియు విద్యావంతులు రాజకీయాల్లోకి ప్రవేశించి వ్యవస్థను విప్లవాత్మకంగా మారుస్తారని మనం ఎప్పుడూ ఆశించాము. అయితే, అది జరగలేద కాబట్టి అవినీతి రాజకీయ నాయకులతో సర్దుబాటు ఆవలిసిన పరిస్థితి. మన ఆలోచనా విధానాన్ని, రాజకీయాలను, విధాన ఫ్రేమ్‌వర్క్‌ను మొత్తంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 


మన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం అలాగే ప్రజల సంక్షేమం కోసం అంతర్లీనంగా రూపొందించబడిన విధాన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే భారతదేశంలోని సంక్షోభాన్ని పరిష్కరించవచ్చు. చాలా మంది నాయకులు, నిపుణులు “స్థానిక స్వపరిపాలన” వంటి ఫ్రేమ్‌వర్క్‌ ని ఉత్తమమైనదిగా చూస్తారు; మన వ్యవస్థాపక సభ్యులు కూడా స్వాతంత్ర్యానికి ముందు, తరువాత దీనిని గట్టిగా సమర్థించారు. కాబట్టి, దాని గురించి ఇంకా దానిలో చిక్కులను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.


1992లో, రాజ్యాంగానికి 73వ మరియు 74వ సవరణల ద్వారా, స్థానిక ప్రభుత్వ సంస్థలు- పంచాయతీ రాజ్ వ్యవస్థ (గ్రామీణ పాలన) మరియు మునిసిపాలిటీలు (పట్టణ పరిపాలన) ప్రతి రాష్ట్రం అమలు చేయడాన్ని తప్పనిసరి చేశారు. నేడు భారతదేశంలో మనం పాలన (గవర్నెన్స్) విభజనను రెండు స్థాయిలలో మాత్రమే చూస్తున్నాము: కేంద్రం మరియు రాష్ట్రం. స్థానిక స్వపరిపాలన (లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ) ఉందని మనందరికీ తెలిసినా అది నామమాత్రమే. స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ టూ నో పవర్ కేటాయిస్తుంది. దీని వలన పారిశుధ్యం, సరిగ్గా లేని రోడ్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య, విద్యుత్ సమస్యలు మొదలైన స్థానిక సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన అధికార వికేంద్రీకరణకు ఆటంకం కలిగిస్తుంది. వాస్తవానికి, స్థానిక సమస్యలను పరిష్కరించడానికి లోకల్ స్థాయిలలో అధికారాన్ని కలిగి ఉండటమే గ్రాస్ రూట్-లెవల్ ప్రజాస్వామ్యం అని చూపొచ్చు. 


మన దగ్గర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ సంస్థలు ఉన్నప్పటికీ వాటికి మరిన్ని వనరులు, సామర్థ్యాలు అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం, నిధులు , పాలనా విధమం మరియు సామర్థ్యాలను వికేంద్రీకరించడానికి అనుమతించకుండా చురుకుగా నిర్ణయం తీస్కుంటాయీ. సవరణలు చేసి 30 సంవత్సరాలు అయినా, స్థానిక పాలనను సమర్థవంతంగా అమలు చేయడాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యవంతంగా విస్మరించాయి; ఇది పట్టణ వరదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం, ఉపాధి లేకపోవడం, నిలకడలేని అభివృద్ధి మరియు అనేక ఇతర సమస్యలకు దారితీసింది. 


మనకు తెలిసినట్లుగా 2015లో ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGలు) విడుదల చేసింది మరియు 2030 నాటికి ప్రతి దేశం ఈ లక్ష్యాలను చేరుకోవాలని సూచించింది. UN ఇటీవల 2022- SGDs సూచికను విడుదల చేసింది, దీనిలో భారతదేశం 166 లో 121 స్థానంలో ఉంది. అన్ని అభివృద్ధి లక్ష్యాలలో మనం ఎలా వెనుకబడి ఉన్నామో ఈ సూచిక చూపిస్తుంది. అయినప్పటికీ, మన రాజకీయ నాయకులు అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు మాత్రమే అని నమ్ముతారు మరియు విద్య, వైద్యం, ఉపాధి, నాణ్యమైన పని, మురుగునీటి వ్యవస్థ మరియు పర్యావరణ నాణ్యతను సౌకర్యవంతంగా విస్మరించడంలో ఆశ్చర్యం లేదు. అనేక మంది సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పండితులు మరియు నిపుణులు మనం అన్ని 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గ్రాస్ రూట్ మార్పు మరియు సమాజ సుస్థిరత ద్వారా సాధించగలమని దృఢంగా విశ్వసిస్తున్నారు.

 

సుస్థిరమైన సమాజా ని నిర్మించడానికి మరియు భారతదేశాన్ని ప్రగతిశీల దేశంగా మార్చడానికి, భారతదేశంలో ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన నయా ఉదారవాదం స్థానంలో కొత్త విధాన ఫ్రేమ్‌వర్క్ అమలు చేయడానికి ఇదే సమయం. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం “స్థానిక స్వపరిపాలన” ద్వారానే సాధ్యమవుతుంది. వికేంద్రీకరణ మరియు సుస్థిర లొకాలిటీస్ ఏర్పాటు చేయడం వలన దేశం మొత్తం అభివృద్ధికి దారి తీస్తుంది. కేంద్రీకృత మార్కెట్ వ్యవస్థ నుండి స్థానిక మార్కెట్‌లకు మారడం అవసరం. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి మరియు ఉద్యోగాలను సృష్టించడానికి మనం లోకల్-ఆధారిత వ్యాపారం వ్యవస్థలను సృష్టించాలి. సుస్థిరమైన అభివృద్ధి కోసం మన ప్రజలను మరియు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సుస్థిరమైన లొకాలిటీస్ అభివృద్ధి మరియు స్థానిక మార్కెట్ వ్యవస్థ నయా ఉదారవాదం మరియు కేంద్రీకృత మార్కెట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి.


అందువల్ల, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరియు కొనసాగించడానికి ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మన గళాన్ని పెంచడం అవసరం; అయినప్పటికీ, ఇప్పటికీ, దేశాన్నిఅభివృద్ధి చేయడానికి రాజకీయ వర్గానికి అధికారం ఉంది. అభివృద్ధి విధానాల కోసం పోరాడేందుకు ప్రజాస్వామ్యంలో మరో మార్గం ఉంది, ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులు కలలు గన్న భారతదేశంన్ని నిర్మించవచ్చు


మీలాగే నేనూ ఈ దేశ పౌరుడిని, నేను ప్రజాస్వామ్యం పైన- ( ప్రజల యొక్క, ప్రజల ద్వారా, మరియు ప్రజల కోసం) నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. అట్టడుగు స్థాయి సమస్య పరిష్కారం, సామాజిక సామరస్యం మరియు రాజకీయ & ఆర్థిక సమానత్వాన్ని, పర్యావరణం పరిరక్షించడం లక్ష్యంగా, మనం జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా (JMI)ని ప్రారంభించాము. మన లొకాలిటీస్ ని న్యాయంగా, అందరినీ కలుపుకొని, సుస్థిరంగా ఉండేలా చేయడం ద్వారా భారతదేశాన్నిఅభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని JMI భావిస్తోంది. పౌరులకు వారి రాజ్యాంగ హక్కులను పూర్తిగా గ్రహించేలా మరియు వారి బాధ్యతలను నెరవేర్చడానికి వారికి అవగాహన కల్పించడం మరియు ప్రోత్సహించడం ఇందులో ఉంటుంది. ముఖ్యంగా, మానవులు, ప్రకృతి మరియు ఇతర జాతుల హక్కులు రక్షించబడే సుస్థిరమైన లొకాలిటీస్లను స్థాపించడంలో పౌరులను సాధికారత మరియు నిమగ్నం చేసే దిశగా పని చేయడం JMI లక్ష్యం..


వ్యవస్థాపక సభ్యులు మరియు స్వాతంత్ర్య సమరయోధులు భారత దేశానికి వెన్నెముక గ్రామాలని గుర్తించడం విశేషం. ఇక్కడి నుండే మనం దేశ నిర్మాణాన్ని ప్రారంభించాలి. “స్థానిక స్వపరిపాలన” అనేది లొకాలిటీస్లను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్. అట్టడుగు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి స్థానిక ప్రభుత్వ సంస్థలకు అధికారం, నిధులు, పాలనా విధానం, సామర్థ్యాలను వికేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందువల్ల, సమగ్ర శేరిలింగంపల్లి అనేది అట్టడుగు స్థాయి అభివృద్ధి మరియు సుస్థిరతను సాధించే దిశగా మొదటి అడుగు వేయడానికి జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా యొక్క చొరవ. 


పూర్తిగా చదివినందుకు ధన్యవాదములు. మీరు టీచర్, డాక్టర్, రైతు, ఇంజనీర్, లాయర్, యాక్టివిస్ట్ లేదా బాధ్యతగల పౌరులని నేను భావిస్తున్నాను. ఇది మీకు నా విన్నపం, మన అందరం కలిసి రాజకీయాలను మార్చాల్సిన సమయం ఇది. ఈరోజు మనం మన సంక్షేమం కోసం వీధుల్లో పోరాడుతున్నాం, అయితే మన భవిష్యత్తు కోసం బ్యాలెట్ బాక్స్ (లేదా EVM మెషీన్లు)పై పోరాడాలి. స్వాతంత్ర్యానికి ముందు మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న అభివృద్ధిని చూడడానికి భారతదేశంలో జస్టిస్ మూమెంట్ అవసరం. తోటి భారతీయులకు నా విజ్ఞప్తి ఇది: మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా, మనం కలిసికట్టుగా ఉండి రాజకీయాలు మరియు విధాన రూపకల్పనలను మార్చుకుందాం.

 

“పౌరులు నివసించే మరియు సురక్షితంగా ఉండే ప్రదేశం నుండే ప్రజాస్వామ్యం సజీవంగా మారుతుంది. కాబట్టి, స్థానిక స్వపరిపాలన మరియు సమాజ స్థిరత్వం నిజమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి ఏకైక మార్గం.”




- Akarsh Sriramoju



Contact : [email protected]


Copyrights © 2023. All rights reserved by  Samagra Serilingampally