ప్రజల మరియు సమాజ శ్రేయస్సు కోసం పని చేద్దాం

స్థానిక స్వపరిపాలనను మనందరి భాగస్వామ్యం తో బలోపేతం చేద్దాం

అన్ని ప్రభుత్వ సేవలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం అమలయ్యేలా చూద్దాం

తెలంగాణ ఎన్నికల రోజు: నవంబర్ 30

మన నినాదాలు

సామజిక న్యాయం

ఏ వ్యక్తి యొక్క సామజిక మరియు ఆర్ధిక స్థితిగతుల్ని చూడకుండా, సమాన హక్కులు మరియు అవకాశాలు మంజూరు చేసే న్యాయం ఆధారిత సమాజంన్ని మేము కోరుకుంటున్నాము.

పర్యావరణ న్యాయం

అందరికీ పర్యావరణ పరిరక్షణ లో భాగస్వామ్యులని చేసే, నిర్ణయాలలో మరియు సహజ వనరులను అందరికి సమానత్వంతో అందించే, మరియు పర్యావరణం యొక్క స్థిరత్వం, గౌరవం కలిగి వుండే సమాజాన్ని మేము కోరుకుంటున్నాము.

ఆర్ధిక న్యాయం

దేశ పౌరులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం తప్పనిసరిగా ‘లాభాల కంటే ప్రజలు మరియు బుగోళం యొక్క శ్రేయస్సు కు ప్రాధాన్యతను ఇచ్చే; సుస్థిరమైన, సమానమైన మరియు సమ్మిళిత సమాజ అభివృద్ధిని వీలు కల్పించే ఒక శ్రేయస్సు-ఆధారిత ఆర్థిక వ్యవస్థను మేము కోరుకుంటున్నాము..

రాజకీయ న్యాయం

ప్రతి వ్యక్తికి పాలనా ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండేలా, ప్రతి ఒక్కరూ వారి రాజకీయ హోదాతో సంబంధం లేకుండా చట్టం ముందు సమానంగా పరిగణించబడేలా; ఒక పారదర్శకమైన, అందుబాటులో ఉండే, మరియు జవాబుదారీ వ్యవస్థను మేము కోరుకుంటున్నాము.

మన కాంపెయిన్


కాంపెయిన్ గురించి

సమగ్ర శేరిలింగంపల్లి అనేది మన నియూజికవర్గాన్నిఒక ఇన్నోవేషన్ సిటీ గా మార్చడానికి, సమగ్ర మార్పు తీసుకురావడానికి మరియు పౌరులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు మరియు విధాన నిర్ణేతలను చేర్చుకోవడం ద్వారా వ్యవస్థలో పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభించిన ఒక ప్రచారం. సమగ్ర మార్పు కోసం, మనకు సామాజిక, ఆర్థిక, పర్యావరణ మరియు రాజకీయ న్యాయం అవసరం. స్థానిక స్వపరిపాలన మరియు సమాజ సుస్థిరత ద్వారా ఒక ఇన్నోవేషన్ సిటీని సృష్టించాలి అని ఆకర్ష్ శ్రీరామోజు ఈ దీర్ఘకాలిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆయన ఈ దిశగా తొలి అడుగు వేశారు.

మన దేశం/రాష్ట్రం/నియోజకవర్గంలో ప్రస్తుత సమస్యలు సామాజిక, ఆర్థిక, పర్యావరణ మరియు రాజకీయ సంక్షోభాల కారణంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా, మనం ఇప్పటికీ వివక్ష, అసమానతలు, నిరుద్యోగం, వాతావరణ ప్రమాదాలు మొదలైన వాటిని ఎదుర్కొంటున్నాము. వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి మనం తక్షణమే సమగ్ర మార్పు లక్ష్యంగా పెట్టుకోవాలి. స్థానిక పాలన మరియు సుస్థిర లొకాలిటీస్ ద్వారా మాత్రమే మనం వ్యవస్థను మార్చగలము

సమగ్ర శేరిలింగంపల్లి ప్రచారం అట్టడుగు స్థాయి సమస్యలను పరిష్కరించడంతోపాటు సమాజ స్థాయిలో మార్పు తీసుకురానుంది. కింది అంశాలు ఫై పని చేయడం జరుగుతుంది: విధాన రూపకల్పన మరియు స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యం. స్థానిక ఆర్థిక నెట్‌వర్క్‌ని సృష్టించడం మరియు తద్వారా ఉపాధిని మెరుగుపరచడం . పాఠశాలల వెలుపల తరగతి గది వాతావరణాన్ని సమాజానికి విస్తరింపజేయడం ద్వారా విద్యా వ్యవస్థను మార్చడం పారదర్శక మరియు జవాబుదారీ కలిగి ఉండేలా సమర్థవంతమైన పురపాలక వ్యవస్థను ఏర్పాటు చేయడం. వాతావరణ ప్రమాదాలను అరికట్టడానికి సరస్సులు మరియు జీవవైవిధ్య రక్షణపై దృష్టి పెట్టడం అవసరమైన పౌరులకు ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడం

  • విధాన రూపకల్పన మరియు స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యం.
  • స్థానిక ఆర్థిక నెట్‌వర్క్‌ని సృష్టించడం మరియు తద్వారా ఉపాధిని మెరుగుపరచడం
  • పాఠశాలల వెలుపల తరగతి గది వాతావరణాన్ని సమాజానికి విస్తరింపజేయడం ద్వారా విద్యా వ్యవస్థను మార్చడం
  • పారదర్శక మరియు జవాబుదారీ కలిగి ఉండేలా సమర్థవంతమైన పురపాలక వ్యవస్థను ఏర్పాటు చేయడం.
  • వాతావరణ ప్రమాదాలను అరికట్టడానికి సరస్సులు మరియు జీవవైవిధ్య రక్షణపై దృష్టి పెట్టడం
  • అవసరమైన ప్రజలకు ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడం

దిగువ ఫారమ్ ద్వారా నమోదు చేసుకోండి. రేపటి సమాజం కోసం విధానాలను రూపొందించడానికి మరియు మన శేరిలింగంపల్లి నియూజికవర్గాన్నిఒక ఇన్నోవేషన్ సిటీ గా మార్చడానిక పౌరులుగా మనమందరం కలిసి నడుదాం. శేరిలింగంపల్లి ని సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత.

 

మేము నమ్ముతున్నాము

వాలంటీర్ అవ్వండి

మనం కాకపోతే,
మరెవరూ చేయలేరు.

ఇప్పుడు కాకపోతే,
ఎప్పటికి మార్పు
సాధ్యం కాదు.

మాకు మీ సపోర్ట్ కావాలి

ఇక్కడ సబ్‌స్క్రయిబ్ చేస్కోండి

Cover for Akarsh Sriramoju
237
Akarsh Sriramoju

ఆకర్ష్ శ్రీరామోజు

Working for Nation Building 🇮🇳
🎓B.Tech, MSc @uohyd - Gold Medalist
Serlingampally Independent MLA Contestant - 2023
Samagra Serilingampally Campaign
Organizer of Justice Movement of India

Sunday morning: Reflecting on the path I have travelled.Life is filled with ups and downs as we know, but there is something that may not change is the purpose with which we are continuing our journey.My purpose is to help individuals to make their life better, the medium I have chosen for that is politics and entrepreneurship.#life #philosophy #career #entrepreneur #YouthOfIndia #youngpeople #politics #Startups #sundaypost ... See MoreSee Less
View on Facebook



Contact : [email protected]


Copyrights © 2023. All rights reserved by  Samagra Serilingampally